● ఇద్దరు మృతి
భువనేశ్వర్: మయూర్‌భంజ్ జిల్లాలో కాల వైశాఖి బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి బరిపద ప్రాంతంలో ఈదురు గాలులతో భారీగా వర్షం కురిసింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు, స్తంభాలు కుప్పకూలాయి. పూరి గుడిసెలు దెబ్బ తిన్నాయి. ఈ ప్రమాదాల్లో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 18వ నంబర్ జాతీయ రహదారిపై చెట్టు కూలడంతో ఒక యువ బైకర్ మృతి చెందాడు. బరిపద – కులియానా రోడ్డులోని ఒసొనొజొడ కూడలి వద్ద ఈ ఘటన జరిగింది. బరిపద – ఉదొలా మార్గంలో ఖుంటా వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో మరో బైకర్ మృతి చెందాడు.


