శ్రీకాకుళం కల్చరల్ : భక్తి, జ్ఞాన, వైరాగ్యాల త్రివేణి సంగమం శ్రీరామచంద్ర శతకమని వక్త మేడూరి సత్యనారాయణమూర్తి అన్నారు. నగరంలోని ఉపనిషన్మందిరంలో వజ్రోత్సవాల సందర్భంగా జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో శనివారం రామచంద్ర శతకంపై ప్రసంగించారు. ఆదిభట్ల నారాయణదాసు రచించిన సుమారు 1200 గ్రంథ రాజములలో శ్రీరామచంద్ర శతకం ఒకటని చెప్పారు. అనంతరం డాక్టర్ కోమలరావు వక్తను సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు గుమ్మా నగేష్, కామేశ్వరరావు, అప్పలకొండ, శరత్‌బాబు, శ్రీనివాసరావు, సూర్యనారాయణ, పట్నాయక్, నరసింహమూర్తి, ఈశ్వరరావు, పతంజలి శాస్త్రి, వెంకటరమణ, మురళీకృష్ణ, సూరిబాబు, ఉమాదేవి, పి.శాంతమ్మ, పద్మావతి, అరుణకుమారి, కృష్ణవేణి పాల్గొన్నారు.


