శ్రీకాకుళం పాతబస్టాండ్: పుట్టపర్తి నారాయణాచార్యులు కవి, బహు భాషావేత్తని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ నారాయణాచార్యులు తెలుగు సాహిత్యానికి, ప్రాచీన అధ్యయనాలకు చేసిన అపారమైన సేవలకు గౌరవసూచకంగా ఏటా మార్చి 28న ఆయన జయంతిని జరుపుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, సెట్‌శ్రీ సీఈఓ అప్పలనాయుడు, పర్యాటక అధికారి నారాయణరావు, సి–సెక్షన్ పర్యవేక్షకులు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


