మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితి సింగరాజకొండ గ్రామానికి చెందిన ఒక యువకుడు, ప్రేమించిన అమ్మాయి కాదనడంతో మనస్థాపం చెంది సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని కలకలం రేపాడు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఓడ్రాప్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని సుమారు 3 గంటలు పాటు శ్రమించి ఆ యువకుడిని రక్షించారు. యువకుడిని విచారించగా తనది మల్కన్‌గిరి సమితి ఎంవీ 7 గ్రామమని తెలిపారు. తాను ప్రేమించిన అమ్మాయి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానన్నాడు. దీంతో పోలీసులు జాగ్రత్తలు చెప్పి విడిచిపెట్టారు.


