
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ఐదేళ్ల బాలుడిని నరికి చంపిన
మరో బాలుడు
కుటుంబ కక్షలతో దారుణం
నవరంగ్‌పూర్ జిల్లాలో ఘటన
కొరాపుట్ : పలక, బలపం పట్టుకోవాల్సిన చేతులు కత్తిపట్టాయి. ప్రాణం అంటే కూడా ఏంటో తెలియని వయసులో మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ వ్యక్తితో ఉన్న వైరం అతని కుమారుడిని చంపే వరకు వెళ్లింది. ఈ దారుణ ఘటన శనివారం నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి తెంతులికుంట్ పంచాయతీ క్రిష్టగుడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ మహురియా కుమారుడు మజేష్ మహురియా(5) శనివారం ఉదయం నుంచి కనిపించలేదు. దీంతో తండ్రి అన్నిచోట్లా వెతికాడు. చివరికి పాడుబడిన ఓ ఇంట్లో మజేష్ మృతదేహం కనిపించింది. శివ రాక చూసి నిందితుడు వెంటనే పక్క గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. మృతదేహం పక్కన కత్తి పడి ఉండటాన్ని గుర్తించి వెంటనే గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆరా తీయగా ఈ దారుణ ఘటనకు పాల్పడినది సమీప బంధువైన 14 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. అనంతరం నిందిత బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. శివకు, నిందితుడికి మధ్య ఇటీవల వివాదం జరిగింది. ఆ కక్ష పెట్టుకుని శివ కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నిందిత బాలుడిని తీసుకెళ్తున్న పోలీసులు
మజేష్ మృతదేహం
ఘటనా స్థలంలో కత్తి

ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025