
హత్యా నేరంపై ముగ్గురు అరెస్టు
పరారీలో ఒకరు
మల్కన్‌గిరి: హత్యా నేరంపై ముగ్గురు అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితిలో ఈ నెల నాలుగో తేదీన నమడాగూఢ గ్రామ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు చేసిన మాత్తిలి పోలీసులు మృతుడు విష్ణు నాయక్‌గా గుర్తించారు. ఆయన తంత్రి విజయ్ నాయక్ తన బిడ్డను ఎవరో హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాపు చేశారు. మృతుడి ఫోన్ నంబర్ ఆధారంగా సాకేతిక డేటా, పరిసర పరిస్థతులను పరిశీలించి హత్యతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ముగ్గురిని శనివారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితులుగా దీపక్ ఓరా, శంకర్ ఇడియా, సాగర్ సునాం, మనోజ్ గౌడ్‌లను అరెస్టు చేయగా.. దీపక్ పరారీలో ఉన్నట్టు మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రదాన్ తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించినట్టు పేర్కొన్నారు. మృతుడు తండ్రి మాట్లాడుతూ.. నిందితులకు కఠిన శిక్ష వేయాలని వేడుకున్నారు.