
భారీగా మందుగుండు నిల్వలు సీజ్
కంచిలి: మండలంలో అనుమతి పొందిన నాలుగు మందుగుండు దుకాణాల్లో అధిక మొత్తంలో టపాసులు నిల్వలు ఉన్నాయనే కారణంతో పోలీసులు ఆ సరుకును సీజ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో వివరాలు తెలియజేశారు. కంచిలిలో బలియాపుట్టుగ వద్ద తెల్లి వైకుంఠరావుకు చెందిన రూ.2,69,470ల సరుకు, అంపురం వద్ద సుంకర మణికంఠకు చెందిన రూ.1,71,900ల సరుకు, జాడుపూడిలో దూపాన సునీల్‌కు చెందిన రూ. 1,16,497లు విలువ కలిగిన సరకు, అదే గ్రామంలో దూపాన శ్రీనివాసరెడ్డికి చెందిన రూ.1,15,300 లు విలువ గల సరకును సీజ్ చేసినట్లు వెల్లడించారు.
సారవకోట: మండలంలోని కొమ్ముసరియాపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రూ.50 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పైల సుశీల, లుకలాపు తిరుపతిరావు బాణసంచాతో పాటు బాణసంచా తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులు కలిగి ఉండడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వారి ఇళ్లపై దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాణసంచాను సారవకోట పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. దీంట్లో పైల సుశీల వద్ద నుంచి రూ.30 వేలు విలువ కలిగిన బాణసంచా, లుకలాపు తిరుపతిరావు నుంచి రూ.20 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేశారు.