
ఆర్‌ఎస్‌ఎస్ శత వార్షికోత్సవాలు ప్రారంభం
జయపురం: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతవార్షిక వేడుకలను జయపురం ఆర్.ఎస్.ఎస్ శాఖ శనివారం ఘనంగా నిర్వహించింది. స్థానిక భూపతి వీధి కనకదుర్గ మందిర ప్రాంగణంలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో జయపురంలో పాణినాళ వీధి, రాధామాధవ వీధి, కెల్లా వీధికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు శత వార్షిక వేడుకల్లో పాల్గొన్నారు. న్యాయవాది, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బిరేష్ పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బిరేష్ పట్నాయక్ దీప ప్రజ్వలన చేసి శత వార్షిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ముఖ్యవక్తగా అధ్యాపకులు, గ్రామ వికాశ కార్యకర్త బిజయకుమార్ భట్, పట్టణ ఆర్‌ఎస్‌ఎస్ సంఘ పరిచాలకులు డాక్టర్ నిరంజన్ మిశ్ర వేదికపై ఆశీనులయ్యారు. వక్తలు ఆర్‌ఎస్‌ఎస్ గత వందేళ్లుగా దేశానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ సంఘం జాతి, కుల, మతాలకు ఎటువంటి ప్రాధాన్యత నీయలేదని వెల్లడించారు. ఎవరు ఏ ధర్మం వారైనా దేశ భక్తి, హిందూ దేశ నిర్మాణం పట్ల ఆసక్తి ఉన్న వారెవరైనా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్ర నిర్మాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచేందుకు కార్యకర్తలు సమైఖ్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సుభ్రత పండా, సత్యనారాయణ మిశ్ర, కార్యదర్శి సురేష్ నందా, శుభం పండాలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థన గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు ప్రేమానంద నాయక్, నారాయణ మిశ్ర, ప్రపుల్ల రాయ్, బలరాం పాడీ, సుధాంశు పాడీ, తేజశ్వీ చౌదరి, జితు దొలాయ్, గుప్త పాహిగ్రహి, వై.ఎస్.ఖన్నతోపాటు 50 మందికి పైగా పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ శత వార్షికోత్సవాలు ప్రారంభం