
వ్యాధుల నివారణకు సమగ్ర చర్యలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశం హాల్‌లో వేక్టర్ వ్యాధి (దోమల ద్వారా వచ్చే వ్యాధులు) నివారణకు శనివారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ సమగ్ర చర్యలు ప్రారంభించారు. మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధుల ఉధృతిని నియంత్రించేందుకు ప్రతి సమితిలో ప్రత్యక శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన కర్యక్రమాలు నిర్వహస్తామని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ దోలామణి ప్రధాన్ అన్నారు. వర్షకాలంలో దోమలు ఎక్కువగా ఉన్నందున్న ప్రతి గ్రామంలో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. దోమ తెరలు వాడాలని, జిల్లా కేంద్రం ప్రతీరోజు ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా నిల్వ నీటిని తొలగించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, మాలేరియశాఖల వైద్యులు పాల్గొన్నారు.