
ఘనంగా దీపావళి
పర్లాకిమిడి: స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్‌లో శనివారం సాయంత్రం దీపావళి పండను ముందస్తుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవీ మఠం మహాంత రామానంద దాస్ విచ్చేశారు. విద్యాలయం పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర పట్నాయక్ జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించేందుకే ఈ పండగ నిర్వహిస్తారన్నారు. భారత త్రివిధ దళాలు సాధించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని పలువురు కోనియాడారు. కాశ్మీర్‌లో పెహల్గాం వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు శ్రద్ధాంజలి తెలిపారు. అనంతరం 2000 దీపాలు పాఠశాల ఆవరణలో భారత్ మాత ఆకారంలో వెలిగించి దీపావళిని ఆనందోత్సవాలతో నిర్వహించారు. అనంతరం విద్యార్థులు పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శిశుమందిర్ ప్రధాన ఆచార్యులు సరోజ్ పండా ఆధ్వర్యంలో జరిగాయి.

ఘనంగా దీపావళి

ఘనంగా దీపావళి