
అమ్మో భయం!
సుభయ్ గ్రామంలో చెట్టుపై ఆత్మ ఉందంటూ అలజడి చెట్టును కొట్టేసి నదిలో నిమజ్జనం చేసేందుకు గ్రామస్తుల యత్నం అంగీకరించని పరిసర పొరుగు గ్రామాల ప్రజలు ఎట్టకేలకు పోలీస్‌స్టేషన్‌లో చెట్టును దగ్ధం చేసిన సిబ్బంది
చెట్టు మీద దెయ్యం..
కొరాపుట్ : కొరాపుట్ జిల్లాలో రెండు రోజులుగా గిరిజనుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆత్మ చెట్టు (హంటర్ ట్రీ) కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఎటువంటి వివాదాలకు తావులేకుండా పోలీసులే ప్రజాప్రతినిధుల సమక్షంలో చెట్టును దగ్ధం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిమిలిగుడ సమితి సుభయ్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆందోళనకు గురైన గ్రామస్తులు మంత్రగాడి వద్దకు వెళ్లారు. అతను పూజలు చేసి గ్రామ శివారులోని చెట్టుపై ఆత్మ ఉందని, చెట్టు కొట్టేసి నదిలో నిమజ్జనం చేయాలని సూచించాడు. దాంతో గ్రామ యువకులు చెట్టును కొట్టేసి ట్రాక్టర్‌లో వేసి నదిలో వేయడానికి వెళ్లారు. నదిని ఆనుకుని ఉన్న ప్రతి గ్రామంలోనూ స్థానికులు తమ పరిధిలో చెట్టుని నిమజ్జనం చేయడానికి వీళ్లేదని ప్రతిఘటించారు. పలుచోట్ల తమ సంప్రదాయ ఆయుధాలు పట్టుకొని పహారా కాశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. అన్ని గ్రామాల ప్రజలను రప్పించి ప్రజాప్రతినిధుల సమక్షంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు. అనంతరం సునాబెడా పోలీస్ స్టేషన్ పరిధిలోనే దగ్ధం చేశారు.

అమ్మో భయం!