
మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి
బీడీవో కృష్ణ చంద్ర దళపతి
రాయగడ: మునిగుడ సమితి పరిధిలోని వివిధ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రజా ప్రతనిధులు కృషి చేయాలని వారి వారి ప్రాంతాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే అవకాశం కలుగుతుందని బీడీవో కృష్ణ చంద్ర దళపతి అన్నారు. స్థానిక సమితి సమావేశం హాల్‌లో పంచాయతీ సర్పంచ్‌లు, సమితి, వార్డు సభ్యులతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. పంచాయతీల్లో వికసిత గ్రామం, వికసిత ఒడిశా పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. గ్రామాలకు అనుసంధానించే రహదారులు, విద్య, వైద్యం అవాస్ గృహాలు వంటి మౌలిక సౌకర్యాలు అందరికీ అందేలా సహకరించాలని అన్నారు. గ్రామీణ గృహ నిర్మాణ యోజన పథకంలో భాగంగా లబ్ధిదారులు సులువుగా పథకాన్ని పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమితి అధ్యక్షురాలు దుఖిని నుండ్రుక అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సంతోష్ సున, జిల్లా పరిషత్ సభ్యులు మాధవీ కొంధొపాణి, సమితి ఉపాధ్యక్షులు ఆదర్శ కులసిక, ఎంపీ ప్రతినిధి రజనీకాంత్ పడాల్ పాల్గొన్నారు.