
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి కుమార్ ధముని కూడలిలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి లారీ బలంగాఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనచోదకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. డుమురిగుడ పంచాయతీ పొరొడిగుడ గ్రామానికి చెందిన కపిల్‌భొయ్ అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా కుమారఖర్‌ధముని వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు సకాలంలో బైక్ నుంచి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బైకు లారీ కిందకు దూసుకుపోవడంతో నుజ్జునుజ్జయ్యింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన లారీ డ్రైవర్‌ను స్థానికులు నిలదీశారు.
మునిగుడలో శిశు మహోత్సవాలు
రాయగడ: జిల్లాలోని మునిగుడ ప్రభుత్వ నోడల్ ఉన్నత పాఠశాలలో శిశుమహోత్సవం సురభి–25 పేరిట శనివారం ఉత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు సుభాష్ కొర, అక్షయ రోదోల ఆధ్వర్యంలొ జరిగిన ఉత్సవాల్లో బీఈవో గణేష్ సొబొరో, ఏబీఈవో సుభాష్ సింగ్, సురభీ పాల్గొన్నారు. కార్యక్రమ ఉద్దేశాన్ని బీఈవో సొబొరో వివరించారు. విద్యార్థుల్లో కళారంగంపై ఉన్న ఆసక్తిని.. వారి ప్రతిభను బయటకు తీసేందుకు ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో 16 క్లస్టర్ విద్యాలయాలకు చెందిన 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకోగా విద్యార్థుల మధ్య నిర్వహించిన చిత్రలేఖనం, వక్తృత్వ, క్విజ్ తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
షణ్ముఖపాత్రోకు ఎమ్మెల్యే నివాళి
కొరాపుట్: ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు షణ్ముఖ పాత్రో ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి.. నందాహండి సమితి సొరుగుడ గ్రామంలో గోవిందాలయ ఆశ్రమంలో షణ్ముఖ పాత్రో భౌతికకాయానికి శనివారం నివాళులర్పించారు. షణ్ముఖపాత్రో సేవలు గుర్తు చేశారు. జిల్లాకి చెందిన షణ్ముఖ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గోవిందాలయ స్వచ్ఛందసంస్థను ఏర్పాటు చేసి అంబులైన్స్, గిరిజనులకు విద్యాబోధన తదితర సేవలు అందజేసేవారు.
గంజాయి స్వాధీనం
కొరాపుట్: గంజాయి తరలిస్తున్న వారిని కొరాపుట్ రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కొరాపుట్ రైల్వే స్టేషన్లో జీఆర్‌పీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పాండిచేరికి చెందిన ప్యాసింజర్లు ఎం.ప్రభాకర్, అజయ్ కదలికలు అనుమానంగా ఉండడంతో వారి బ్యాగులు పరిశీలించగా.. అందులో నాలుగు కిలోల గంజాయి పట్టుబడింది. తమ దుస్తుల మధ్య గంజాయి దాచి పెట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి గంజాయి సీజ్ చేశారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

త్రుటిలో తప్పిన ప్రమాదం