
నూతన కార్యవర్గం ఎన్నిక
కొరాపుట్: కొరాపుట్ జిల్లా స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఎస్‌యూజే) సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. జిల్లా కేంద్రంలోని స్కిల్ డవలప్‌మెంట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. దీనిలో జిల్లా అధ్యక్షుడిగా తరుణ్ కుమార్ మహాపాత్రో (రుణా), ఉపాధ్యక్షుడిగా రమేష్ సాహు, కార్యదర్శిగా శిశిర్ ఆచార్య, సంయుక్త కార్యదర్శిగా ప్రశాంత్ కుమార్ బిసోయిలు ఎన్నికయ్యారు. ఇటీవల నారాయాణపట్న ధరిత్రి విలేకరి రాజ్ కిషోర్ జెన్నా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం జరిగింది. దీంతో అతనికి ఆర్థిక సాయం అందజేయాలని సమావేశం నిర్ణయించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కీర్తిచంద్ర సాహు, జిల్లా మాజీ అధ్యక్షుడు బిజయ చౌదరి, సీహెచ్ శాంతాకర్ తదితరులు పాల్గొన్నారు.