
రక్తదానం.. ప్రాణదానం
జయపురం: రక్తదానం అన్ని దానాల కన్నా మహత్తరమైనదని స్వయం సేవక సంఘ్ పశ్చిమ ప్రాంత ప్రముఖులు సుశీల్ జైన్ అన్నారు. ఆదివారం జయపురం అరవింద నగర్ సరస్వతీ శిశు విద్యాలయ దివ్య మందిర ప్రాంగణంలో కేశవ సేవా ట్రస్టు వారు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సునీల్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో రక్తహీన రోగులు, క్షతగాత్రులు, గర్భిణులకు రక్తం అవసరం ఉంటుందన్నారు. ఎటువంటి సమయంలో రక్త లేమితో ఏ ఒక్కరూ మరణించ కూడదని అటువంటివారు రక్షించాలంటే రక్తం ఎంతో అవసరమన్నారు. అందుచేత ప్రజలు, ముఖ్యంగా యువతీ, యువకులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిర నిర్వహణకు సరస్వతీ శిశు విద్యా మందిర పూర్వ విద్యార్థి సంఘం సహకరించింది. కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల హాస్పిటల్ రక్తనిధి టెక్నీషియన్‌లు దాతల నుంచి రక్తం సేకరించారు. ఈ శిబిరంలో 48 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జయపురం నగర ఆర్.ఎస్.ఎస్ పరిచాలకులు డాక్టర్ నిరంజన్ మిశ్ర, సరస్వతీ శిశు విద్యాలయ పరిచాలన కమిటీ ప్రేమానంద నాయక్, రక్తదాతల మోటివేటెడ్ ధమంజొడి అధికారి డాక్టర్ నరేష్ చంద్ర సాహు, డాక్టర్ రమణీ రంజన్ దాస్‌లు అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతీ శిశు విద్యా మందిర్ ప్రధాన ఆచార్య డాక్టర్ రమణిని సన్మానించారు. శిబిర నిర్వహణలో విద్యామందిర్ పూర్వ విద్యార్థులు ప్రభాకర రౌత్, ప్రదీప్ త్రిపాఠీ, రక్తదాతల మోటివేటెర్లు మిహిర్ మిశ్ర, సత్యవాది మిశ్రలు రక్తదాన శిబిర నిర్వహణలో సహకరించారు. ఈ శిబిరంలో రక్తదాతలకు ప్రశంసాపత్రాలతో సన్మానించారు.

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం