
ఘనంగా హిందీ దినోత్సవం
జయపురం: మన రాష్ట్ర భాష హిందీ అని, ఆ భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తులు అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అఖిల భారతావణిని జాగృత పరచి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహదపడిందని వక్తలు వెల్లడించారు. ఆదివారం హిందీ దివస్(హిందీ దినోత్సవం)ను జయపురం సిటీ హైస్కూల్ సభాగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ట్రాన్స్‌లేటర్ మహేంద్ర కుమార్ శామంతరాయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా రామన్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ప్రముఖ కళాకారుడు దిరెన్ మోహన్ పట్నాయక్, విశ్రాంత హిందీ ఉపాద్యాయులు రాధామోహన్ పండా, తెలుగు సాంస్కృతి సమితి అధ్యక్షుడు బీరేష్ పట్నాయక్, సిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ సుధాకర్ పట్నాయక్,ౖ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులలో వ్యాస రచన, గేయ రచన, వక్తృత్వ పోటీలు, గీత పఠనం, పోస్టర్లు తయారు చేయటం, కథలు చెప్పే పోటీలు తదితవి నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థి ఆయుష్ పట్నాయక్ కీబోర్డుపై బ్రాండ్ మాతరమ్ సంగీతం వినిపించాడు. హిందీ పద్యాలు చదివే పోటీలలో సాయి సర్జిమ్, అభశ్రీ పట్నాయక్, దేవాంశీ పట్నాయక్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. సుధాలేఖన పోటీలలో చైత్రిక, నటరాజ్ బబ్యాంశి సాహు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. జూనియర్స్ పోస్టర్ మేకింగ్ పోటీలలో ఎ.మౌనిక, ఎ.సాయిశ్రాద ఆచారి, సభ్నమ్ ప్రవీన్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. సీనియర్ కవిత రచన పోటీలలో వై.గంగోత్రి, సి.హెచ్.సుప్రియ, స్వేతా సింగ్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. వక్తృత్వ పోటీలలో సి.హెచ్.సుప్రియ, ఎ.హరిణి, ఎల్. రాజేశ్వరరావు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. సిటీ స్కూల్ హిందీ ఉపాధ్యాయురాలు కల్పన రత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు పపిత ప్రధాన్, 2025 హెచ్.ఎస్.సి పరీక్షలలో హిందీలో 95 శాతం మార్కులు సాధించిన అమిత యాదవ్, ఆశిష్, కె.మోనికను సన్మానించారు.

ఘనంగా హిందీ దినోత్సవం

ఘనంగా హిందీ దినోత్సవం

ఘనంగా హిందీ దినోత్సవం

ఘనంగా హిందీ దినోత్సవం

ఘనంగా హిందీ దినోత్సవం