
కానిస్టేబుల్ కుటుంబానికి సాయం
మందస: ఎచ్చెర్లలోని జిల్లా సాయుధ పోలీసు దళంలో విధులు నిర్వహించిన ఏఆర్ కానిస్టేబుల్ బెహరా మురళీకృష్ణ అనారోగ్యంతో చికిత్స పొందూతూ ఈ నెల 8న మృతి చెందారు. మందస కిల్లమ్మ వీధిలో నివాసం ఉంటున్న ఆయన భార్య మమతారాణికి ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా డెత్ రిలీఫ్ ఫండ్ నుంచి లక్ష రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు. కార్యక్రమంలో మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రోణంకి కృష్ణంనాయుడు, ట్రెజరర్ కె.భుజంగరావు పాల్గొన్నారు.
పోరాటాలతోనే హక్కుల సాధన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అంగన్‌వాడీల పోరాట ఫలితంగానే మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మినీ అంగన్‌వాడీల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) పరిరక్షణకు అంగన్‌వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సుధ, కె.కళ్యాణి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, యాప్‌ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సభలో యూనియన్ నాయకులు హైమావతి, శాంతామణి, కె.వి.హేమలత, కె.సుజాత, జె.కాంచన, భూలక్ష్మి, చంద్రమౌళి, మాధవి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, సెలవులు మంజూరు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం యూటీఎఫ్ కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ 6వ మహాసభలు నిర్వహించారు. ముందుగా సీఐటీయూ జెండాను సీనియర్ ఆశా వర్కర్ జి.పార్వతి ఆవిష్కరించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అమరావతి నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లా అధ్యక్షురాలు డి.ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ యాప్‌ల భారం తగ్గించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌ను ఆశాలుగా మార్పు చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆశాల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వేతనాలు పెంపుదల చేయాలని, లేనిపక్షంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షురాలిగా కె.నాగమణి, అధ్యక్షురాలిగా డి.ధనలక్ష్మి, ఉపాధ్యక్షులుగా డి.దమయంతి, పి.జయలక్ష్మి, జి.పార్వతి, ప్రధాన కార్యదర్శిగా జి.అమరావతి, సహాయ కార్యదర్శులుగా పి.ప్రేమలత, స్వర్ణలతా పట్నాయక్, ఎం.లావణ్య, కోశాధికారిగా వై.సుజాతతో పాటు 35 కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్.వి.రమణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ద్రాక్ష
పొందూరు: లోలుగు కేజీబీవీ విద్యార్థిని ఎం.ద్రాక్ష జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. అండర్–18 విభాగంలో జిల్లా స్థాయిలో షాట్‌పుట్‌లో మొదటి స్థానం, డిస్కస్ త్రోలో రెండో స్థానంలో నిలిచింది. ఈ నెల 27 నుంచి 29 వరకు ఏలూరు జిల్లా అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎస్.లలితకుమారి, పీఈటీ రూపవతి తెలిపారు.

కానిస్టేబుల్ కుటుంబానికి సాయం

కానిస్టేబుల్ కుటుంబానికి సాయం

కానిస్టేబుల్ కుటుంబానికి సాయం