
నార్త్‌జోన్ టోర్నీలో సిక్కోలుకు మరో విజయం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏసీఏ నార్త్‌జోన్ అంతర్‌జిల్లాల క్రికెట్ టోర్నీలో శ్రీకాకుళం జట్టు మరో విజయాన్ని నమోదుచేసింది. జిల్లా జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమష్టిగా రాణించడంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు తూర్పుగోదావరితో జరిగిన మల్టీడేస్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో సాధించిన 59 పరుగుల కీలకమైన ఆధిక్యతంతో శ్రీకాకుళం జయభేరి మోగించింది. విజయనగరం జిల్లా వేదికగా ఏసీఏ నార్త్‌జోన్ అంతర్ జిల్లాల త్రీడేస్ (మల్టీడేస్) పురుషుల అండర్–23 క్రికెట్ టోర్నమెంట్ వారం రోజుల కిందట మొదలైన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో తూర్పుగోదావరితో శ్రీకాకుళం తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్‌స్పిన్నర్ మొదలవలస పూర్ణచంద్ర అత్యద్భుతమైన బౌలింగ్ చేసి ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు మూడోరోజు ఆటముగిసే సమయానికి 310 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంతో మ్యాచ్ ప్యాయింట్లను శ్రీకాకుళం నిలబెట్టుకుని విజయం సాధించినట్టయింది. జిల్లా జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ బొద్దంకి జగదీశ్వరరావు 106 పరుగులతో అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ నంబళ్ల సుశాంత్ 72 పరుగులతో రాణించాడు.
జట్టు క్రీడాకారులకు అభినందన..
నార్త్‌జోన్ అండర్–23 మల్టీడేస్ క్రికెట్ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదుచేయడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు క్రీడాకారులను అభినందించారు. స్వయంగా మైదానం వద్దకు చేరుకుని క్రీడాకారులకు మిఠాయిలు పంచిపెట్టారు. జిల్లా జట్లు సమస్టిగా రాణించడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ అమ్మద్, కోశాధికారి మదీనాశైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్ హర్షం వ్యక్తంచేశారు. జిల్లా జట్టుకు సెలక్టర్‌గా జయశంకర్, కోచ్ కమ్ మేనేజర్‌గా రవితేజ వ్యవహరిస్తున్నారు.
మహిళల క్రికెట్ అభివృద్ధికి..
శ్రీకాకుళంలో మహిళా క్రికెట్ విస్తరణ, అభివృద్ధి కోసం జిల్లా క్రికెట్ సంఘం మరో అడుగుముందుకేసింది. బాలికల క్రికెట్ సబ్‌సెంటర్‌ను శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానం కోసం పాఠశాల హెచ్‌ఎంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. క్రీడామైదానంలో సగభాగాన్ని క్రికెట్ విస్తరణకు వినియోగించనున్నారు.

నార్త్‌జోన్ టోర్నీలో సిక్కోలుకు మరో విజయం

నార్త్‌జోన్ టోర్నీలో సిక్కోలుకు మరో విజయం