
తమిళనాడులో పర్యటిస్తున్న కొరాపుట్ జెడ్పీ బృందం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పరిషత్ బృందం తమిళనాడు రాష్ట్రంలో అధికారిక పర్యటన చేస్తుంది. ఆదివారం కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షుడు సస్మితా మెలక నేతృత్వంలో జిల్లా పరిషత్ సభ్యులు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలసి పలు సంక్షేమ పథకాలు పరిశీలించారు. చైన్నెలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొరాపుట్ జిల్లాలో ఉత్పత్తులు, కొట్‌పాడ్ వస్త్రాలు ఆ ప్రభుత్వ అధికారులకు అందజేశారు. చెంగల్ పట్టు జిల్లాలో పంచాయతీ రాజ్ సహాయంతో 150 మంది మహిళలు తయారు చేస్తున్న కళాఖండాల తయారీ కేంద్రం పరిశీలించారు. కాంచీపురం జిల్లాలో మహిళలచే నిర్వహించబడుతున్న చిన్న స్థాయి పరిశ్రమలు పరిశీలించారు. అనంతరం కంచిలోని కామాక్షి దేవాలయం, పాండిచేరి రాష్ట్రం సందర్శించారు.

తమిళనాడులో పర్యటిస్తున్న కొరాపుట్ జెడ్పీ బృందం