
ముగిసిన వినాయక ఉత్సవాలు
జయపురం: జయపురంలో ఇప్పటి వరకూ వినాయక చవితి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక ఆర్‌అండ్‌బీ కాలనీ, నెహ్రూనగర్ డెప్పిగూడ, భూపతి వీధి కూడలి వద్ద మోడరన్ గ్రూపు వినాయక ఉత్సవాలు ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ జరిగింది. వినాయక విగ్రహాలను వాహనాల్లో తరలించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.
నాల్కో సందర్శన
కొరాపుట్: భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) ని ఉన్నతాధికారులు సందర్శించారు. కొరాపుట్ జిల్లా దమన్‌జోడిలోని నాల్కో డైరక్టర్ జగదీష్ అరోరా రిఫార్మర్ కాంప్లెక్స్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బృందంలో నాల్కో ఉన్నతాధికారులు మాచిరెడ్డి కృష్ణరెడ్డి, సతీష్ చంద్ర దుబే తదితరులు ఉన్నారు.
ప్రథమ చికిత్సపై అవగాహన
కొరాపుట్: ప్రథమ చికిత్సపై విద్యార్థినులకు అవగాహన ఉండాలని అధ్యాపకురాలు డాక్టర్ సంజుక్త పండా పేర్కొన్నారు. ఆదివారం నబరంగపూర్ జిల్లా కేంద్రంలోని మహిళా మహా విద్యాలయంలో జరిగిన ఫస్ట్ ఎయిడ్ అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. పాము కాటు, పక్షవాతం, కాలిన గాయాలు, అపస్మారక స్థితి వంటి ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాంటి సందర్భంలో ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కుతాయని అన్నారు. కార్యక్రమంలో యూత్ రెడ్‌క్రాస్ అధికారి డాక్టర్ అయుత పండా, తర్నమ్ ఆరా, సునీత పాత్రో, లక్ష్మీకాంత్ సౌర తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రయాణికుల బస్సు బోల్తా
భువనేశ్వర్: నయాగడ్ జిల్లా దస్‌పల్లా ప్రాంతంలో ఆదివారం ప్రయాణికుల బస్సు ప్రమాదా నికి గురైంది. కటక్ నుంచి బొలంగీర్‌కు ప్రయా ణిస్తుండగా జముసాహి సమీపంలో బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
టైరు పగిలి పది మందికి గాయాలు
భువనేశ్వర్: వ్యాన్ టైరు పగిలి దుర్ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. కటక్ నుంచి సంబలపూర్ వెళ్తుండగా అఠొగొడొ సమీపం కొఖొడి రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్‌లో ఉన్న వాయిద్యకారులు గాయపడినట్లు సమాచారం.
యూరియా స్టాకు పరిశీలన
పర్లాకిమిడి: జిల్లాలోని గుసాని సమితిలో బాగుసల, పాటికోట, జాజిపూర్ సహకార సంఘాలను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం సందర్శించారు. గోదాముల్లో ఉన్న యూరియా స్టాకును అడిగి తెలుసుకున్నారు. యూరియా స్టాకును పరీక్షించిన ఎమ్మెల్యే రూపేష్ కొంత యూరియా పక్క రాష్ట్రానికి తరలి వెళ్తున్నట్లు గుర్తించారు. పాటికోట, బాగుసల గ్రామాల్లో యూరియ స్టాకును పరిశీలించి అధికారులతో సమీక్షించారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విలేకరులకు తెలియజేశారు.

ముగిసిన వినాయక ఉత్సవాలు

ముగిసిన వినాయక ఉత్సవాలు

ముగిసిన వినాయక ఉత్సవాలు