
ప్రజామరుగుదొడ్లను.. తెరిపించాలి
● పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్
పాణిగ్రాహికి ప్రజల విజ్ఞప్తి
పర్లాకిమిడి: కొత్త బస్టాండ్‌లో నెల రోజులుగా మూతబడి ఉన్న ప్రజా మరుగుదొడ్లను (సౌచాలయం తెరిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరుగుదొడ్లను మూసి వేయడంతో ప్రయాణికులు అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం ఉదయం మూతబడిన మరుగుదొడ్లను సందర్శించారు. గతంలో బీహారీ వాళ్లకు కాంట్రాక్టు పద్ధతిన పురపాలక సంఘం సౌచాలయ నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పారు. అయితే ఇటీవల స్నానపు గది శ్లాబు విరిగిపోయిపోవడంతో నెలరోజులుగా మూసివేశారు. దీంతో స్టేషన్‌కు వచ్చి పోయే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో ఉన్న రెండు ప్రజామరుగుదొడ్లు మూతబడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి పర్లాకిమిడి మున్సిపల్ చైర్మన్ నిర్మలా శెఠి, ఈలో లక్ష్మణ ముర్మును పిలిపించి వివరణ అడిగారు. బస్టాండ్‌లో ఉన్న మరో సౌచాలయం కూడా మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారని బస్సు వర్కర్స్ సంఘం జిల్లా కోఆర్డినేటర్ నర్సింగ మాల బిశోయి, ప్రైవేటు బస్సు యాజమాన్యం సంఘం కార్యవర్గ సభ్యులు కిలారి గోపి ఎమ్మెల్యే రూపేష్‌కి వివరించారు. 15 రోజుల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేసి ప్రయాణికులకు అందుబాటులో తెస్తామని పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి హామీ ఇచ్చారు.

ప్రజామరుగుదొడ్లను.. తెరిపించాలి

ప్రజామరుగుదొడ్లను.. తెరిపించాలి