
దేవీ నవరాత్రి ఉత్సవాలకు అంకుర పూజలు
● 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
● ఏర్పాట్లలో కమిటీ సభ్యులు నిమగ్నం
పర్లాకిమిడి: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పర్లాకిమిడి పట్టణంలో పలు కూడళ్లలో పందిళ్లు, పెండాళ్లు, దుర్గాదేవి విగ్రహాల తయారీతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ఎస్‌కేసీజీ కళాశాల జంక్షన్ వద్ద జిల్లా ప్రైవేటు డైవర్స్ సంఘం, మోటారు వర్కర్స్ కలిసి దేవీ శరన్నవరాత్రి పూజలకు అంకుర పూజలు ఆదివారం ప్రారంభించారు. ఈనెల 22న అష్టమి నాడు కళాశాల జంక్షన్ వద్ద దుర్గాదేవి ప్రతిష్టించి పూజలు జరుపుతారు. అలాగే పెద్ద బ్రాహ్మాణ వీధి వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 21న మహాలయ అమావాస్య నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమౌతాయని నిర్వాహాకులు తెలిపారు. పెద్దబ్రాహ్మాణ వీధిలో గత 60 ఏళ్లుగా పెద్ద ఎత్తున దుర్గాశరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ధోబా చాకలి వీధి వద్ద కూడా పెద్ద ఎత్తున దుర్గా పెండాళ్లు నిర్మిస్తున్నారు.

దేవీ నవరాత్రి ఉత్సవాలకు అంకుర పూజలు

దేవీ నవరాత్రి ఉత్సవాలకు అంకుర పూజలు