
ఏర్పాటుకు సన్నాహాలు
రాజధానిలో ఏఐ కెమెరాల..
● 645 ప్రదేశాల్లో 3,100 కెమెరాలు ఏర్పాటు
భువనేశ్వర్: రాజధానిని నేర రహితంగా మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ దిశలో ప్రభుత్వం మానవ వనరులకు బదులుగా ఏఐ (యాంటీ ఫిక్షన్ ఇంటెలిజెన్స్)ను మోహరించాలని నిర్ణయించింది. ఏఐతో మొత్తం రాజధానిని నియంత్రించడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. నగరంలోని ప్రధాన వీధుల్లో 3,100 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
శక్తివంతమైన వ్యవస్థ
ఈ కెమెరాలు చాలా శక్తివంతమైనవి. అవి సీ్త్ర, పురుషుల గుర్తింపు, రంగు తదితర అంశాల్ని ఇట్టే పసిగడతాయి. ఇవి నేరస్తులను, సంబంధిత వాహనాలను సులభంగా పట్టుకోగలవు. నేరస్తుడి గురించి నామ మాత్రపు సమాచారం అందజేస్తే పూర్తి వివరాలను తెలియజేస్తుంది. ఈ ఏఐ కెమెరాలను అన్ని పోలీస్ ఠాణాలకు అనుసంధానించవచ్చు. నేరం చేసి ఎవరూ తప్పించుకోలేరు. నేరస్తుడు లేదా నేరంలో పాల్గొన్న వాహనం నగరంలో ఎక్కడ తిరుగుతుందో ఇట్టే తెలుసుకుని సంబంధిత ఠాణా పోలీసులకు సమాచారం ప్రసారం చేస్తుంది. ఫలితంగా, నేరస్తుడిని పట్టుకోవడం సులభం అవుతుంది. గతంలో ప్రతి 1,000 మంది జనాభాకు 75 సాధారణ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ ఒక్కో ఏఐ కెమెరా 2,000 మందిని పర్యవేక్షించగలవు. రాష్ట్ర ప్రభుత్వం తుది ఆమోదంతో టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు వివిధ విదేశీ నగరాలను సందర్శించి అక్కడి ట్రాఫిక్, నేర నియంత్రణ వ్యవస్థలను పరిశీలించిన నివేదికల ఆధారంగా అటువంటి ఆధునిక సాంకేతికతని ప్రారంభించాలని నిర్ణయించారు. మొదటి దశలో రాజధానిలో నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో అమలు చేయాలని ప్రభుత్వం ప్రవేశ పెడుతుంది. ఇది ప్రభావవంతంగా ఉంటే అంచెలంచెలుగా ఈ వ్యవస్థను క్రమంగా ఇతర నగరాల్లో కూడా ప్రవేశపెడతారు.
భువనేశ్వర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, వివరణాత్మక సమీక్ష మరియు అధ్యయనం తర్వాత, 645 ప్రదేశాలలో 3100 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి దశలో 1500 ఏఐ కెమెరాలను నగరంలో ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రీ–బిడ్డింగ్ సమావేశం ఇటీవల ముగిసింది. 14 కంపెనీలు పాల్గొని టెండర్ తీసుకోవడానికి ఆసక్తి చూపాయి.
ఒడిశాలో మొదటిసారిగా ఒపెక్స్ మోడల్ కింద టెండర్ ప్రక్రియ జరుగుతోంది. గతంలో, ప్రభుత్వం మొత్తం డబ్బు ఖర్చు చేసేది. తదనంతర కార్యాచరణలో లోపాలు తలెత్తిన అనుంబంధ సంస్థలు ఎగవేయడం వంటి సంఘటనలు చోటుచేసుకునేవి. సీసీటీవీ కెమెరాలు లేదా ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ వ్యవహారంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని చవి చూసిన ప్రభుత్వం ఒపెక్స్ మోడల్ టెండర్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇది పూర్తిగా పనితీరు ఆధారిత టెండర్. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి ముందస్తు ఖర్చు చేయదు. టెండర్ గెలిచిన సంస్థ అన్ని ఖర్చులను భరిస్తుంది. ఏఐ కెమెరాను కొనుగోలు చేయడం నుండి దానిని ఇన్‌స్టాల్ చేయడం మరియు అమలులోకి తీసుకురావడం వరకు సంస్థలు తన స్వంత ఖర్చుతో అన్ని పనులను చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బును సంస్థకు విడతలవారీగా చెల్లిస్తుంది. పని తీరుని చవి చూసిన తర్వాత కెమెరా వ్యవస్థ సరిగ్గా పని చేస్తే ఆ సంస్థ వాయిదాల డబ్బును పొందుతుంది. లేకుంటే చేజార్చుకోవడం తథ్యం. ఖరారైన సంస్థకు ఏడేళ్లలో 84 వాయిదాల్లో మొత్తం చెల్లించే నిబంధనతో టెండర్ నిర్దేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా అధ్యక్షతన ఇటీవల దీనిపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిందని ఆ సీనియర్ అధికారి తెలిపారు. దీనిలో భువనేశ్వర్ పోలీస్ కమిషనర్, భువనేశ్వర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, వివిధ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఏఐ కెమెరాల మౌలిక సదుపాయాల గురించి వివరంగా చర్చించారు.