
పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు
కొరాపుట్: యువత పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు అధిరోహించవచ్చని గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. పశ్చిమ ఒడిశా ప్రధాన కేంద్రం సంబల్‌పూర్ జిల్లా కేంద్రంలో శనివారం ఆయన పర్యటించారు. జిల్లాలో బుర్లాలోని వీరేంద్ర సాయి టెక్నికల్ యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, డీఎస్సీ, డిలీట్, పీహెచ్‌డీ ఇతర డిగ్రీలు అందజేశారు. అంతకుముందు పశ్చిమ ఒడిశా ఆరాధ్య దేవత మా సమలేశ్వరి శక్తి పీఠం సందర్శించారు. ఆయనతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూరజ్ సూర్యవంశీ, సంపత్ చంద్ర స్వయ్, ఎమ్మెల్యేలు రబినాయక్, జయ నారాయణ మిశ్ర తదితరులు ఉన్నారు.

పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు