
దసరా ఉత్సవాలకు సన్నాహాలు
జయపురం: పట్టణంలో చారిత్రాత్మక దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దసరా ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక మున్సిపల్ సభాగృహంలో సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భాగంగా ఆదివారం శుభరాట వేసేందుకు నిర్ణయించారు. అనంతరం ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలను చేపట్టనున్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ కాశ్యప్ తదితరులు పాల్గొన్నారు.