
● పాఠశాలల సందర్శన
పర్లాకిమిడి: గజపతి జిల్లా నోడల్ అధికారి, ఒడిశా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ స్మృతి స్నిగ్దామిశ్రా జిల్లాలో గుసాని, రాయఘడ, ఆర్.ఉదయగిరి బ్లాకుల్లోని పలు ఉన్నత పాఠశాలలను శనివారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న 5టీ పథకం అమలు తీరు పరిశీలించారు. నారాయణపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆర్.ఉదయిగిరి ఉన్నత పాఠశాల, మహేంద్రగడ, కెరండీ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలపై తనిఖీ చేశారు. జిల్లాలోని ఉన్నత విద్యాలయాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5టీ పథకం ద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్ అంపోలు రవిబాబు తదితరులు ఉన్నారు.