
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025
ప్రభుత్వ సంరక్షణలో పసికందు
● బొలంగీరులో ఘటన
భువనేశ్వర్:
రాష్ట్రంలో ఇంకా పసికందుల విక్రయం వంటి ఘటనలు కనిపిస్తున్నాయి. పేదరికం కారణంగా తండ్రి నవజాత శిశువును రూ.20,000 కు అమ్మేసిన విచారకర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బొలంగీర్ జిల్లాలో తీవ్ర పేదరికం కారణంగా ఆడ పసికందును రూ.20,000కి అమ్మేశారు. ఈ నెల 1న కనక్ రాణా ప్రసవించిన ఆడ శిశువును తండ్రి నీలా రాణా బర్‌గడ్ జిల్లా పాయికమల్ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తికి అమ్మేశాడు. బొలంగీర్‌లోని టిట్లాగడ్ మండలం నుంచి పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు వెలువడుతున్న ఆరోపణలకు ఈ సంఘటన నిలువెత్తు రుజువుగా నిలిచింది. తీవ్ర పేదరికం మధ్య రెండో కుమార్తెను పెంచే స్థోమత లేక ఆ కుటుంబం శిశువును అమ్మకానికి పెట్టినట్లు కన్న తండ్రి తెలిపాడు. అయితే తన అంగీకారం లేకుండా పురిటి బిడ్డని నిర్దాక్షిణ్యంగా గుర్తు తెలియని మరొకరి చేతిలో పెట్టడాన్ని తట్టుకోలేక పోతున్నాను అని కన్న పేగు కోతతో బాలింత ఉసూరుమంటోంది. ‘మేము పేదవాళ్లం, వలస కార్మికులుగా పనిచేస్తూ మా జీవనం సాగించేవాళ్లం. ఆరు నెలల తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మా సర్పంచ్ నా రేషన్ బియ్యం అందుబాటులో లేదని చెప్పారు. మేము పేదరికంలో జీవిస్తున్నాము. అందుకే, రెండవ బిడ్డను అమ్మేశాను‘ అని బిడ్డ తండ్రి నీలా రాణా వాపోయాడు. ‘నేను పిపలాపొదర్ ఆస్పత్రిలో ఒక ఆడపిల్లని ప్రసవించాను. ఆ తర్వాత నా భర్త ఆ బిడ్డను నాకు తెలియని వ్యక్తికి నా అంగీకారం లేకుండా అమ్మేశాడు’ అని తల్లి కనక్ చెబుతున్నారు.
ప్రభుత్వ సంరక్షణలో పసికందు
అమ్ముడుపోయిన పసికందును జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. జిల్లా బాలల రక్షణ విభాగం, టిట్లాగడ్, పాయికమల్ ఠాణాల పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో రూ. 20,000 కి అమ్ముడుపోయిన పసికందును బర్‌గడ్ జిల్లా పాయికమల్ బస్తాన్‌పడాలో సంజయ్ అనే వ్యక్తి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
మృత శిశువుని ప్రసవించిన బాలిక
జగత్‌సింగ్‌పూర్ జిల్లా కుజంగ్ పోలీస్ ఠాణా గండకిపూర్ ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మృత శిశువును ప్రసవించింది. సందిగ్ధ రక్తస్రావం గుర్తించిన కుటుంబ సభ్యులు బాలికను కుజంగ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెను 4 నెలల గర్భవతిగా నిర్ధారించారు. ఇంతలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జగత్సింగ్‌పూర్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో బాలిక మృత శిశువును ప్రసవించింది. కౌమార బాలింత ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థిషతులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు అత్యవసరం.
● బొలంగీరులో ఘటన
న్యూస్‌రీల్

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025