
సీఎం దృష్టికి ఆదివాసీల సమస్యలు
కొరాపుట్: ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్జికి నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి నివేదిక ఇచ్చారు. గురువారం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో లోక్ సేవా భవన్‌లో జరిగిన 11వ ఆదివాసీ జిల్లాల సమీక్షాలో ఈ నివేదిక అందించారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై ఆదివాసీ నేతల అభిప్రాయాలను తెలియజేశారు. ఈ నివేదిక అనుసారంగా రాష్ట్రంలో ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వ పథకాలు అమలు కానున్నాయి. ఈ సమావేశంలో నబరంగ్‌పూర్ జిల్లాకి చెందిన రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి నిత్యానంద గోండో పాల్గొన్నారు.