అక్రమ తుపాకుల తయారీ శిబిరం గుట్టురట్టు
భువనేశ్వర్: అంగుల్ జిల్లా పోలీసు అధికారులు శుక్రవారం జంబువా గ్రామంలో అక్రమ తుపాకుల తయారీ శిబిరం గుట్టు రట్టు చేశారు. అంగుల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ దాడిలో బేణు కిషన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతడు అక్రమంగా తయారు చేస్తున్న ఒక్కో తుపాకీ రూ. 5,000 నుంచి రూ. 10,000లకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. ఖమర్ పోలీసు ఠాణా పరిధి జంబువా గ్రామంలో అక్రమ తుపాకీ తయారీ యూనిట్‌ను కనుగొన్నారు. ఈ దాడిలో తుపాకీల తయారీకి ఉపయోగించే వివిధ పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంట్లో తయారు చేసిన తుపాకీ, అనేక చేతి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బేణు కిషన్‌ను నిందితునిగా పరిగణించి అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ దాడిని అంగుల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పర్యవేక్షించారు. దర్యాప్తులో ఒక్కో తుపాకీని రూ. 5,000 నుంచి రూ. 10,000 అమ్ముతున్నట్లు నిందిత కిషన్ వెల్లడించాడు. ప్రాథమిక విచారణలో బేణు కిషన్ చాలా సంవత్సరాలుగా ఈ అక్రమ ఆయుధ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడని తేలింది. పట్టుబడిన తర్వాత నిందితుడు బేను కిషన్ నిర్దోషి అని చెప్పుకుంటూ తుపాకుల తయారీకి తనకు లైసెన్స్ లేదు, తుపాకులు తయారు చేసే విధానం మాత్రమే తెలుసు, జీవనోపాధి కోసం తుపాకుల్ని చేస్తున్నట్లు వివరించాడు. తయారు చేసిన ఒక్కో తుపాకీని రూ. 10,000 వరకు అమ్ముతున్నట్లు పేర్కొన్నాడు.


