మల్కన్‌గిరిలో చొరబాటుదారుల గుర్తింపు
మల్కన్‌గిరి: ఒడిశా నుంచి బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రప్పించే ప్రక్రియ వేగవంతమైన తర్వాత అన్ని జిల్లాల్లో హడావుడి నెలకొంది. ఇందులో భాగంగా మల్కన్‌గిరి జిల్లాలో పీనల్ ప్రాజెక్ట్ ప్రాంతంలోని పునరావాస శరణార్థి శిబిరాల్లో వివిధ సమయాల్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించారు. మొత్తం 663 మంది చొరబాటుదారులు ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తం 213 గ్రామాలు ఉన్నాయి. అప్పట్లో వీరికి గతంలో జీవనోపాధి కోసం భూమి ఇచ్చి ఇతర సదుపాయాలు కూడా కల్పించారు. కొందరికి భారత పౌరసత్వం కూడా లభించింది. ఈ మధ్య కాలంలో బెంగాలీ స్థానిక చొరబాటుదారులు మల్కన్‌గిరి జిల్లాలోకి చొరబడి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 2001లో 469 మంది చొరబాటుదారులను గుర్తించగా, 2024 నాటికి సర్వేలో 663 మందిని గుర్తించారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత చొరబాటుదారుల ఏరివేత ప్రారంభం కావడంతో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి వెనక్కి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని నోడల్ ఏజెన్సీగా నియమించింది.


