గొంతు కోసుకున్న ఏఎస్‌ఐ
జయపురం: కొట్‌పాడ్‌కు డ్యూటీపై వెళ్లిన ఒక ఏఎస్‌ఐ గొంతు కోసుకుని ఆస్పత్రి పాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్‌లో బుధవారం స్పెషల్ జస్టిస్ పర్యటన కోసం కొరాపుట్ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఏఎస్‌ఐ చరమా నాయిక్ విధుల్లో భాగంగా వెళ్లారు. విధులు పూర్తయ్యాక మిగతా సిబ్బందితో కొట్‌పాడ్‌లో ఉన్నారు. కానీ ఉన్నట్టుండి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే సహచరులు అతడిని కొట్‌పాడ్ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జయపురంలోగల కొరాపుట్ జిల్లా కేంఽద్రాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న జయపురం సదర్ పోలీసు అధికారి సచింద్ర ప్రధాన్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ రౌత్‌లు జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి ఏఎస్‌ఐ పరిస్థితిపై ఆరా తీశారు.
బాల్య వివాహాలు నేరం
రాయగడ : బాల్య వివాహాలు వల్ల బంగారు భవిష్యత్తు నాశనమవుతోందని జిల్లా సామాజిక సంక్షేమ శాఖాధికారి మీనతి దేవ్ అన్నారు. స్థానిక సమితి కార్యాలయంలో గురువారం బాల్య వివాహాల నివారణపై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాల నివారణకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అంగన్‌వాడీ కార్యకర్తలు సైతం తమవంతు కృషి చేయాలన్నారు. చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు బీడీఓ కాలుచరణ్ నాయక్, వివిధ ధార్మిక సంఘాల ప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కూలిన ఇంటి గోడ
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి చంద్రగిరి పంచాయతీ సురిగుంజ్ గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షం ధాటికి డంబురుధర్ నాయక్ అనే వ్యక్తికి చెందిన ఇంటి గోడ కూలిపొయింది. లోతట్టు ప్రాంతంలో ఇల్లు ఉండటంతో వర్షం నీరంతా లోపలికి చొరబడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. నిరాశ్రుయుడైన నాయక్ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
లబ్ధిదారులతో గవర్నర్ ముఖాముఖి సంభాషణ
భువనేశ్వర్: ఖుర్దా జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి స్థానిక కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి సంప్రదించి సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ముద్రా యోజన లబ్ధిదారులను కలిశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ మరియు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – పట్టణ పథకాల కింద లబ్ధిదారుల ఇళ్లను గవర్నరు ప్రత్యక్షంగా సందర్శించారు. ఖుర్ధా మున్సిపాలిటీ 4వ నంబరు వార్డు, ఖుర్ధా మండలం బొరా సాహి గ్రామ పంచాయతీ కుంభిలో ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకాలతో లబ్ధిదారుల వాస్తవ అభిప్రాయాన్ని, అనుభవాలను అర్థం చేసుకోవడానికి ఆయన ముఖాముఖి సంభాషించడం విశేషం.
గొంతు కోసుకున్న ఏఎస్‌ఐ
గొంతు కోసుకున్న ఏఎస్‌ఐ


