
కలెక్టరేట్ వద్ద నిరసన
–10లోu
ఘనంగా హనుమాన్ జయంతి
హనుమాన్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రాజెక్టులు పూర్తి చేయాలి
ప్రాజెక్టులు పూర్తి చేయాలని గవర్నర్ సూచించారు. మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
పర్లాకిమిడి: పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ జిల్లాలో ఆమ్‌ఆద్మీ సర్కారు దళితులపై అక్రమంగా కేసులు బనాయించి వందలాది మంది జమీన్ ప్రగతి సంఘర్ష కమిటీ (జెడ్.పి.యస్.సీ.) సభ్యులను అరెస్టు చేయడంపై ఆల్ ఇండియా కిసన్ మజ్దూర్ సభ, గజపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కేదార్ శోబోరో మాట్లాడుతూ, పంజాబ్‌లో సంగ్రూర్ జిల్లాలో మహారాజా జంద్ తాలుకా 927 జమీందారీ భూములు పంచిపెట్టాలను అడిగితే జమీన్ ప్రగతి సంఘర్ష కమిటీ నాయకులను అరెస్టు చేసినందుకు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. సంగ్రూర్‌లో దళిత నాయకులను విడుదల చేయాలని, పోలీసు బలగాలు వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తూ పంజాబ్ గవర్నరు భగవంత్ మాన్‌కు ఉద్దేశించి రాసిన వినతిని కలెక్టరేట్ అసిస్టెంటు కలెక్టర్ త్రిబేన్ దేవికి అఖిల భారత కిసాన్ సభ నాయకులు కేందార్ శోబొరొ అందజేశారు.

కలెక్టరేట్ వద్ద నిరసన