
రోడ్డెక్కిన ఆఫ్‌షోర్ నిర్వాసితులు
మెళియాపుట్టి: మండలంలోని రేగులపాడు ఆఫ్‌షోర్‌కు గ్రామాన్నిచ్చిన చీపురుపల్లి నిర్వాసితులు గురువారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. అక్కడే నిరాహార దీక్ష చేపట్టారు. పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ.. హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన 460 జీఓ ప్రాప్తికి పూర్తిస్థాయి ప్యాకేజీ ఇవ్వాలని కోరా రు. వలస వెళ్లిన 132 మంది నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వలేదన్నారు. నిర్వాసితులందరికీ అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని, డీ పట్టా భూ ములకు సొమ్ములు చెల్లించాలని, చెల్లింపుల్లో తేడా లు ఉన్నాయని వాటిని సవరించి ఇళ్లకు పరిహారం చెల్లించాలన్నారు. పలాస మండలం గోపీవల్లభపురం, టెక్కలిపట్నంలో నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాలు లేవని, శ్మశాన వాటికలు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, తాగునీటి సదుపాయం లేదని అన్నారు. అన్ని సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు దీక్షలు కొనసాగుతాయన్నారు.