
లంచగొండి ఇన్‌స్పెక్టర్ ఆటకట్టు
● పలాస తూనికలు కొలతల కార్యాలయంలో ఏసీబీ దాడులు ● రూ.1.78 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలాస మండలం తూనికలు కొలతల కార్యాలయంలో గురువారం ఆ శాఖ అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. పలాస తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ ప్రభుత్వ లైసెన్స్ పొందిన రిపేరర్స్ వద్ద రూ.1.78 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. జిల్లాలో పద్నాలుగు మండలాలకు ఈయన ఒక్కరే ఇన్‌స్పెక్టర్ కావడంతో అన్ని ప్రాంతాలు తిరగడానికి వీల్లేక.. ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్‌లు మరమ్మతులు చేసే ప్రభుత్వ లైసెన్సు పొందిన వ్యక్తులను పెట్టుకుని వారి ద్వారా అదనంగా నగదు వసూలు చేస్తూ వస్తున్నారు. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌లు పనిచేస్తున్నట్లు తని ఖీలు చేసి సీలు వేసి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి రూ.300 చలానా తీయాలి. అయితే దీంతో పాటు రూ.400 అదనంగా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఇవ్వకపోతే పదే పదే తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో కొందరు వ్యాపారులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. మొత్తం 441 మంది వ్యాపారుల వద్ద ఏడాదికి సర్టిఫికెట్ కోసం రూ.1.78 లక్షలు తన సిబ్బంది నుంచి తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడు తూ వ్యాపారుల వద్ద అక్రమంగా వసూలు చేసిన నగదు తీసుకుంటుండగా పట్టుకున్నామని, కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నామని వెల్లడించారు.
●సూక్ష్మ రూపధారి..
హనుమద్ జయంతి సందర్భంగా సూక్ష్మ
కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి హనుమంతుని గద, శ్రీరాముని రామబాణం తయారు చేశారు. పలుచటి బంగారపు
రేకు పైన ఎలాంటి అతుకులు లేకుండా రెండు గంటలు కష్టపడి చిన్న గద, బుల్లి రామబాణం తయారు చేశారు.
–కాశీబుగ్గ

లంచగొండి ఇన్‌స్పెక్టర్ ఆటకట్టు