
●సహకరిస్తున్నాను
చిన్నారులంటే నాకు చాలా ఇష్టం. వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం మా ఉద్దేశం. లాఫింగ్ క్లబ్‌కు నా వంతు సహకారం అందిస్తున్నాను. చిన్నారుల బాల్యానికి మెరుగులు దిద్దుతున్న ఇద్దరు స్నేహితులకు అండగా ఉంటున్నాను.
– నటుకుల మోహన్, క్లబ్ నిర్వాహకులు
●డ్రాయింగ్ అంటే ఇష్టం
నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. నేను రోజూ డ్రాయింగ్ తరగతులకు వేసవి సెలవుల్లో వస్తాను. నేను బాగా బొమ్మలు వేయడం నేర్చుకున్నాను.
– భరత్, 9వ తరగతి, శ్రీకాకుళం
●విశ్రాంత జీవితం ఆనందంగా ఉంది
మాకు వచ్చిన విద్యను చిన్నారులకు నేర్పడం ఎంతో తృప్తిగా ఉంది. ముఖ్యంగా చిన్నారులకు వినోదం కలిగించడమే మా ధ్యేయం. విజ్ఞానం కూడా అందిస్తున్నాం. దీని వల్ల విశ్రాంత జీవితం ఆనందంగా ఉంది.
– ఎల్.నందికేశ్వరరావు, రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్
●ఈ వయసులో అవకాశం
నా మిత్రుడు నందికేశ్వరరావు పిలుపు మేరకు నా టాలెంట్‌ను కూడా నలుగురికి పంచాలని అతనికి చేదోడుగా నిలిచాను. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. రాబోయే తరానికి మంచి విషయాలు నేర్పడం వల్ల మంచి పౌరులుగా మారుతారు.
– బీఎంఎస్ పట్నాయిక్, రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్

●సహకరిస్తున్నాను

●సహకరిస్తున్నాను

●సహకరిస్తున్నాను