
గంజాయి సరఫరా చేస్తూ..
2023 జూలైలో శ్రీకాకుళం జిల్లాలో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అనేకం చేస్తున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తరచూ అరైస్టె ఊచలు లెక్క పెడుతున్నా ఆయనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మోసాలు చేసి డబ్బులు సంపాదించడమే అలవాటుగా చేసుకుని బతికిపోతున్నాడు. పలువురు క్రికెటర్లకు స్పాన్సర్స్ పేరుతో పెద్ద పెద్ద వ్యక్తుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. చాలా మంది ఇతడి మోసాలకు బలైపోయారు. కొందరు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టుబడి జైలుకు వెళ్తున్నాడు.