ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
కొరాపుట్: జయపూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెయిన్ రోడ్డులో పాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట అగ్రసేన్ భవనం వైపు ఉన్న స్టాల్స్ పడగొట్టి పునః నిర్మాణం చేయనున్నారు. పాత బస్టాండ్ ఎదుట గోవర్దన్ చెరువు వద్ద పార్కింగ్ స్థలానికి టెండర్ వేయాలని నిర్ణయించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునీత మాట్లాడుతూ 80 ఏళ్ల పైబడి ఉన్న వృద్ధులకు పింఛన్ల కోసం తమ ప్రతిపాదనలను సిబ్బంది పట్టించుకోకపోవడం తగదన్నారు. సమావేశంలో జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహీణీపతి, సబ్ కలెక్టర్ అక్కవరం స్రశ్యా రెడ్డి, ఎంపీ ప్రతినిధి హసన్ మదాని తదితరులు పాల్గొన్నారు.


