
పిడుగు పడి బాలుడి మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి దళపతిగూఢ పంచాయతీ మేడుకూలి గ్రామంలో గురువారం మామిడి తోటలో పిడుగు పడి రాహుల్ మాడి(10) మృతి చెందాడు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామం నుంచి మామిడితోటలో పండ్లు కోసం రాహుల్, సుకాంత్ చార్కి, (9), సావిత్రీ గోలారీ (22) వెళ్లారు. సరిగ్గా అదేసమయంలో పిడుగు పడడంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మిగతా పిల్లలు కూడా గాయపడ్డారు. విషయం తెలిసి గ్రామస్తులు వీరిని మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాహుల్ చనిపోయినట్లు గుర్తించారు. దీంతో రాహుల్ తండ్రి మత్తిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పిడుగు పడి బాలుడి మృతి

పిడుగు పడి బాలుడి మృతి