న్యూస్‌రీల్
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సవాలు 10 రోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
అమ్మ పండుగ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ముస్తాబైంది. ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఉప ఆలయాలు, ఘాట్ రోడ్డు విద్యుత్ దీపకాంతులతో శోభిల్లుతున్నాయి. ఉత్సవాల తొలి రోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మ వారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజల అనంతరం ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. నూతన పూజా మండపంలో అమ్మ ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాల నిర్వహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్రన వార్చనలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అన్ని దర్శన టికెట్లను దేవస్థానం రద్దు చేసింది.
అమ్మవారికి పది విశేష అలంకారాలు
ఉత్సవాల్లో అమ్మవారు పది విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి ప్రముఖులు విచ్చేస్తుండటంతో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. కొండ దిగువన మహా మండపం ఎదుట నూతన అన్నదాన భవ నంలో రోజు పదివేల మందికి అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం, సాయంత్రం అల్పాహారం అందజేస్తారు. ఒకే దఫా వెయ్యి మంది అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్‌లో చిన్నారులకు పాలు, బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లను అందజేయనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
దసరా మహోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత దుర్గగుడి ఘాట్‌రోడ్డు వద్దకు చేరుకున్న ఆయన అక్కడ క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న యాక్సిస్ గేట్లను, రాజ గోపురం వద్ద జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. పోలీస్ శాఖ తరఫున ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు దంపతులు శనివారం రాత్రి దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు.
● నగర వనం


