తొలిరోజు ఉదయం 8 గంటలకు దర్శనం | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు ఉదయం 8 గంటలకు దర్శనం

Oct 10 2026 2:04 AM | Updated on Oct 10 2026 2:04 AM

ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి దసరా ఉత్సవాలు ● ప్రతి రోజూ ఆరు సమయాల్లో నివేదనలు ● 17న అర్చక సభ, 18న వేద సభ ● దసరా నేపథ్యంలో తొలిరోజు ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి జరుగుతాయి. ● ఉత్సవాల్లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లకు ప్రతి రోజూ నగరోత్సవ సేవ జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం దిగువ నుంచి శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ● 17వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో అర్చక సభ, 18వ తేదీన వేద సభ జరుగుతుంది. ● దసరా ఉత్సవాలు 20వ తేదీతో ముగియనున్నాయి. ముగింపు నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు దుర్గాఘాట్‌లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల హంస వాహన సేవ జరుగుతుంది.

ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి దసరా ఉత్సవాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): నగరంలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో తొలి రోజు 11వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు సర్వ దర్శనం ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 2.30 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ, అనంతరం మూలవిరాట్‌కు స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయి. దేవస్థాన యాగశాలలో ఉదయం 9 గంటలకు గణపతి పూజ, కలశ స్థాపనతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. నూతన పూజా మండపంలో ప్రత్యేక కుంకుమార్చనలు, యాగశాలలో చండీహోమం నిర్వహిస్తారు.

అర్జున వీధిలో స్వాగత ద్వారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement