విజయవాడ, రాజమండ్రి సెక్షన్‌లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

విజయవాడ, రాజమండ్రి సెక్షన్‌లో తనిఖీలు

Oct 10 2026 2:04 AM | Updated on Oct 10 2026 2:04 AM

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాధుర్‌ శుక్రవారం విజయవాడ డివిజన్‌లోని విజయవాడ–రాజమండ్రి సెక్షన్లలో విస్తృత తనిఖీలు చేశారు. విజయవాడ డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా, పలువురు ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆఫీసర్లతో కలసి జీఎం ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి స్టేషన్లలో అమృత్‌ భారత్‌ పథకంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికుల మౌలిక సదుపాయాలు, భద్రత, స్టేషన్‌ల పరిశుభ్రతపై అధికారులతో సమీక్షించారు. ట్రాక్‌ నిర్వాహణ, సిగ్నలింగ్‌ వ్యవస్థలు, యార్డ్‌ పునర్నిర్మాణ పనులు, పని ప్రదేశంలో ఉద్యోగుల భద్రత చర్యలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు.

పుష్కర ఏర్పాట్లపై సమీక్ష

రాబోయే గోదావరి పుష్కరాల్లో యాత్రికుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి స్టేషన్‌లో చేపట్టనున్న ముందస్తు భద్రత చర్యలపై జీఎం.. అధికారులతో సమీక్షించారు. గోదావరి నదీ తీరంలోని పుష్కర ఘాట్‌, మార్కండేయ ఘాట్‌, శ్రద్ధానంద్‌ ఘాట్‌, సరస్వతి ఘాట్‌, గౌతమి ఘాట్లతో సహా ఇతర స్నానఘట్టాలకు వెళ్లే ప్రవేశ మార్గాలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement