ఆత్మీయత కరువై.. ఆందోళన పెరిగి! | - | Sakshi
Sakshi News home page

ఆత్మీయత కరువై.. ఆందోళన పెరిగి!

Oct 10 2026 2:04 AM | Updated on Oct 10 2026 2:04 AM

● చిన్నకష్టానికి కుంగిపోతున్న నేటి తరం ● బాసటగా నిలుద్దాం.. ఆపన్న హస్తం అందిద్దాం ● నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ● పటమటకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి పిల్లల చదువులు, అనారోగ్య సమస్యల కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. సరిగా విధులకు కూడా హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. చివరికి మానసిక వైద్యుల వద్ద చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ● భవానీపురానికి చెందిన రాజీవ్‌ వ్యాపారం చేస్తుంటారు. కొంత నష్టం రాగా, మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నా కుంగిపోయారు. దీంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఆత్మన్యూనతా భావంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు గమనించి మానసిక వైద్యుడిని సంప్రదించడంతో నిలదొక్కుకున్నారు. ఇలా అనేక మంది మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు.

మానసిక ప్రశాంతతే ఆరోగ్యం

పాజిటివ్‌గా ముందుకు సాగాలి

లబ్బీపేట (విజయవాడ తూర్పు): సమాజంలో మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత, విచ్చలవిడి మొబైల్‌ వినియోగం మానసిక సమస్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి ఆవేదనను వినడమే కాకుండా, వారికి ఉపశమనం కలిగించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు. ఏటా అక్టోబర్‌ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘వారి సమస్యను విందాం.. వారి భవితను మారుద్దాం’ అనే నినాదంతో అవగాహన కల్పిస్తున్నారు.

కరువైన ఆత్మీయ పలకరింపులు

నలుగురు కలిసి కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే ఆచారం కూడా కనుమరుగవుతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడో అంతరించిపోయింది. ఆశ, అత్యాశ పెరిగి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది.

బంధువులు, ఆత్మీయుల కలయికలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. ఒకప్పుడు వివాహాలు, ఇతర శుభకార్యాలకు రెండు మూడు రోజుల ముందే బంధువులు వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అనుబంధాలు దూరం కావడం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

చిన్న కష్టానికే కుంగుబాటు

మానసిక సమస్యకు మొదటి సాయం మాత్ర వేయడం కాకపోవచ్చు. బాధలో ఉన్న వ్యక్తి మాటను శ్రద్ధగా వినే ఒక మనిషి తోడు కావాలి. కౌమార దశలోని పిల్లలు సోషల్‌ మీడియా, పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలి.

డాక్టర్‌ ఎస్‌. అశోక్‌ బాబు,

మానసిక వైద్య నిపుణులు

ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆస్తులు, ఆప్తులను కోల్పోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో మానసిక దృఢత్వం అవసరం. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

డాక్టర్‌ గర్రె శంకరరావు, సైకాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement