పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సీటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన జేఎన్‌టీయు కే అంతర్ కళాశాలలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో పరిటాల అమృతసాయి ఇంజినీరింగ్ కాలేజీ జట్టు, మహిళల విభాగంలో విజయవాడ సీఎస్‌సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజి జట్టు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో రెండవ స్థానంలో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, మూడవ స్థానంలో సంయుక్తంగా కానూరు వీఆర్ సిద్ధార్థ, నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ జట్లు నిలిచినట్టు ఫిజికల్ డైరెక్టర్ రఘు తెలిపారు. మహిళల విభాగంలో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ రెండోస్థానంలో నిలవగా, నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ, కాకినాడ జేఎన్‌టీయుకె జట్లు సంయుక్తంగా మూడవ స్థానంలో నిలిచాయన్నారు. విజేతలకు రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎంవీ.సాయిబాబు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేఎన్‌టీయుకె డైరెక్టర్లు ఎ.కృష్ణమోహన్, డాక్టర్ జి.శ్యామ్‌కుమార్, డాక్టర్ జీపీ.రాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.


