జీజీహెచ్‌లో తొలి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో తొలి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ విజయవంతం

Oct 10 2026 2:04 AM | Updated on Oct 10 2026 2:04 AM

జీజీహెచ్‌లో తొలి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ విజయవంతం

లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న నాలుగేళ్ల చిన్నారి తన్మయికి విజయవాడ జీజీహెచ్‌లో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి ఈన్‌టీ విభాగాధిపతి డాక్టర్‌ కొణిదె రవి నేతృత్వంలో సీనియర్‌ కాక్లియర్‌ సర్జన్‌ డాక్టర్‌ రాయుడు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనిత, అసిస్టెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌లు ఈ శస్త్ర చికిత్స నిర్వహించిన వారిలో ఉన్నారు. ఈ సర్జరీ నిర్వాహణకు ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ ఎస్‌ వినయ్‌కుమార్‌, వైద్యులు కిరణ్‌, సుధారాణిలు తమవంతు సహకారం అందించారు. జీజీహెచ్‌లో తొలి కాక్లియర్‌ సర్జరీని విజయవతంగా నిర్వహించిన డాక్టర్‌ రాయుడు వైద్య బృందాన్ని శుక్రవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏవైరావు ్ఢఅభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement