జయ జయహే జానకీ నాయక
జగదానందకారకుడు శ్రీరామచంద్రుడు.. సుగుణాల రాశిసీతమ్మల కల్యాణ వేడుక అంబరాన్ని తాకింది. లోక కల్యాణం కోసం ఏటా నిర్వహించే ఈ వేడుక భక్తుల మదిని పులకింప జేసింది. వందలాదిగా తరలివచ్చిన భక్తజనంతో జిల్లాలోని రామాలయాలు కిటకిటలాడాయి. జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయాయి. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణం కమనీయమై సాక్షాత్కరించింది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధితో పాటు ఇరు జిల్లాల్లోని ప్రధాన రామమందిరాలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
భక్తులకు తలంబ్రాలు అందిస్తున్న అర్చకుడు
ఇంద్రకీలాద్రిపై సీతారాముల కల్యాణాన్ని జరిపిస్తున్న అర్చకులు
విజయవాడ బీసెంట్ రోడ్డులోని రామాలయంలో
కొలువుదీరిన సీతారాములు


