పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోని ఫై ్లఓవర్
జనసంచారం లేక వెలవెలబోతున్న బందరురోడ్డు
నిర్మానుష్యంగా కనిపిస్తున్న కంట్రోల్ రూం జంక్షన్
ఎండలు మండుతున్నాయి. మార్చి చివరి వారం నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం ఎనిమిది గంటలు దాటితే చాలు రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప పగటి వేళ రోడ్డు ముఖం చూడటంలేదు. దీంతో ఉదయం పది గంటలు దాటితే రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై సైతం వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. ఆదివారం ఎండ తీవ్రత పెరగడంతో విజయవాడ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


