మెరుగైన ఫలితాలే శ్రీ గోసలైట్స్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన ఫలితాలే శ్రీ గోసలైట్స్‌ లక్ష్యం

Mar 30 2026 7:23 AM | Updated on Mar 30 2026 7:23 AM

కంకిపాడు: ఏటా మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా తమ సంస్థలో విద్యాబోధన సాగుతోందని విజయవాడ శ్రీ గోసలైట్స్‌ మెడికల్‌ అకాడమీ చైర్మన్‌ నరేంద్రబాబు పేర్కొన్నారు. శ్రీగోసలైట్స్‌ మెడికల్‌ అకాడమీ రీ–యూనియన్‌ ఫెస్టివిటీస్‌ కార్యక్రమం ఆదివారం కంకిపాడులోని అయానా ఫంక్షన్‌ హాలులో జరిగింది. నరేంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అకాడమీలో శిక్షణ పొంది అత్యుత్తమ ర్యాంకులతో జాతీయ స్థాయి, వివిధ రాష్ట్రాల్లోని మెడికల్‌ కళాశాలల్లో మెడికల్‌ సీట్లు సాధించిన మెడికోలను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ.. స్థాపించిన నాటి నుంచి ప్రతి ఒక్క తర గతి గదిని పూర్తి స్థాయిలో డిజటలైజ్‌ చేసి స్మార్ట్‌ బోర్డుల ద్వారా విద్యార్థులకు బోధన అందిస్తున్న ఏౖకైక విద్యాసంస్థ శ్రీగోసలైట్స్‌ అని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో అద్భుత విజయాలను తమ విద్యార్థులు సాధించేలా బోధనా పద్ధతులు అవలంబిస్తున్నామని తెలిపారు. నీట్‌ 2021లో 724, 2022లో 1,013, 2023లో 1,237, నీట్‌ 2024లో 1,392, నీట్‌ 2025లో 1,413 సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, మెడికల్‌ సీట్లు సాధిస్తున్నామన్నారు. శిక్షణ బృందం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement