న్యూస్‌రీల్
ఉపాధి హామీ పథకంలో ఉద్యాన సాగుపై కమ్ముకున్న నీలినీడలు సాగుపై వంద శాతం ఆర్థిక సాయం అంటూ ప్రచారం ఏడాది గడిచినా పెట్టుబడి నిధులు విడుదల చేయని ప్రభుత్వం అప్పులు చేసిన రైతులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూపులు ఎన్టీఆర్ జిల్లాలో జీరో పెట్టుబడి కింద 2500 ఎకరాల్లో ఉద్యాన సాగు
సాగర్ నీటిమట్టం వివరాలు
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కోడూరుపాడులోని ఎన్జీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించాయి.
జి.కొండూరు: సున్నా పెట్టుబడి.. నిత్యం ఆదాయం.. ఆపై ఉపాధి కల్పన అంటూ గొప్పగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సాహం అందించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జీరో పెట్టుబడితో ఉద్యాన సాగు అంటూ స్వల్ప కాల పంట లను సాగు చేసే రైతులను సైతం ఉద్యాన సాగు వైపు మళ్లేలా ప్రభుత్వం ప్రోత్స హించింది.
అప్పులు చేసి ఉద్యాన సాగుపై పెట్టుబడి పెట్టిన రైతులకు ఈ ఏడాది మెటీరియల్ నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిధుల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వచ్చే ఏడాది ఉద్యాన సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎన్టీఆర్ జిల్లాలో 1,307 మంది రైతులు 2,500 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేశారు. అయితే ఈ సాగుకు 2025–28 వరకు మూడేళ్ల కాలానికి కూలీల ఖర్చు కింద రూ.1,170.23 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.507.02 లక్షలు మంజూరు చేశారు. మొదటి ఏడాది 2025–26 సంవత్సరానికి కూలీల ఖర్చు కింద రూ.257.16 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.109.86 లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే మెటీరియల్ ఖర్చుకు సంబంఽధించిన నిధులను ఒక్కరూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కూలీల ఖర్చు నిధులను 20 శాతం ఇంకా విడుదల చేయలేదని సమాచారం. ఇదే కాకుండా 2024–25 సంవత్సరానికి సాగు చేపట్టిన రైతులకు ఈ ఏడాది విడుదల కావాల్సిన నిర్వహణ ఖర్చులు సైతం 20 శాతానికి పైగా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని నమ్మి అప్పులు చేసి సాగు చేపట్టిన రైతులు రాయితీ నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
పథకం ఇలా...
ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వందశాతం రాయితీతో ప్రోత్సహిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండి ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు మూడేళ్ల కాల పరిమితితో విడతల వారీగా నిర్వహణ ఖర్చులను విడుదల చేస్తారు. పండ్ల తోటలకు ఒక రైతుకు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు సాగు చేపట్టేందుకు ఈ పథకంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అయితే డ్రాగన్, గడ్డి, గట్లు వెంబడి మొక్కల పెంపకానికి గరిష్టంగా ఎకరం వరకు ఆర్థికసాయాన్ని అందిస్తారు. ఈ విధంగా సాగు చేపట్టిన రైతులు ఉపాధి హామీ పనులకు వెళ్లకుండా తమ తోటలోనే ఏటా వంద రోజులు పనిదినాలు పొందే అవకాశం ఉంటుంది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యాన సాగు చేపట్టిన రైతులకు పెట్టుబడి నిధులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకంతో రైతులు అప్పులు చేసి పెట్టుబడులకు వెచ్చించారు. ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పితే ఉద్యాన సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. కూలీల నిధులను వెంటనే విడుదల చేయాలి.
– కోట కల్యాణ్,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
I
2025–26 ఏడాదికి ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులకు అందాల్సిన నిధులు ఇలా..
మండలం రైతులు కూలీల ఖర్చు మెటీరియల్ ఖర్చు
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
ఎ.కొండూరు 133 33.20 7.86
చందర్లపాడు 73 12.52 11.21
జి.కొండూరు 53 7.76 3.92
గంపలగూడెం 65 11.73 2.91
ఇబ్రహీంపట్నం 28 5.43 2.83
జగ్గయ్యపేట 56 9.39 6.73
కంచకచర్ల 44 5.67 3.84
మైలవరం 168 35.93 19.45
నందిగామ 77 11.56 4.49
పెనుగంచిప్రోలు 61 7.43 5.61
రెడ్డిగూడెం 139 29.86 7.99
తిరువూరు 94 19.29 10.35
వత్సవాయి 75 13.38 7.33
వీరులపాడు 66 16.23 6.46
విజయవాడరూరల్ 32 6.00 2.85
విస్సన్నపేట 143 31.79 6.03
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది.


