గ్రామ వ్యవసాయ సహాయకులకు రీ–కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రామ వ్యవసాయ సహాయకులకు రీ–కౌన్సెలింగ్‌

Mar 29 2026 6:51 AM | Updated on Mar 29 2026 6:51 AM

చిలకలపూడి(మచిలీపట్నం): కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులకు శనివారం రీ–కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గత సంవత్సరం జూలై నెలలో జరిగిన కౌన్సెలింగ్‌లో తమకు అన్యాయం జరిగిందని గ్రామ వ్యవసాయ సహాయకులు హైకోర్టును ఆశ్రయించటంతో కోర్టు రీ–కౌన్సెలింగ్‌ నిర్వహించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్‌.పద్మావతి ర్యాంకుల ఆధారంగా సీనియార్టీ జాబితా ప్రకటించి వారికి రీ–కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌లో 103 మంది పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఎన్టీఆర్‌ వ్యవసాయాధికారి విజయకుమారి, ఏలూరు జిల్లా ఏడీ వెంకటమణి, ఆచార్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement