ఉషోదయానికి ముందే హుషార్‌! | - | Sakshi
Sakshi News home page

ఉషోదయానికి ముందే హుషార్‌!

Mar 28 2026 7:14 AM | Updated on Mar 28 2026 7:14 AM

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రూరల్‌ పరిధిలో మద్యం అమ్మకాలకు వేళాపాళా లేకుండా పోతోంది. తెల్లవారుజామున వాకర్స్‌ కంటే ముందుగానే రోడ్లపై కూర్చొని మద్యం తాగేవారు హల్‌చల్‌ చేస్తున్నారు. దీంతో పాదచారులు అవాక్కవుతున్న పరిస్థితి. వైవీ రావు ఎస్టేట్‌ నుంచి సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు వరకు ఉదయం వేళ వాకింగ్‌ చేసే వారు అధికంగా వస్తుంటారు. తెల్లవారుజామున టీ దుకాణాల కంటే ముందుగానే మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ వైపరీత్యంపై స్థానికులు కొందరు శుక్రవారం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొత్తపేట పోలీసులు పాముల కాల్వ వద్ద కీర్తి రెస్టారెంట్‌ అండ్‌ బార్‌, వైవీ రావు రింగ్‌ సమీపంలోని శ్రీలక్ష్మీ వైన్స్‌లలో తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న కీర్తి రెస్టారెంట్‌ క్యాషియర్‌, హెల్పర్‌లపై కేసులు నమోదు చేశారు. ఆయా బార్లు, వైన్‌ షాపు నిర్వాహకులు తెల్లవారుజామున 5గంటల నుంచి వైన్‌ షాపులు, బార్లు తెరిచి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కూలీలు, ఇసుక ముఠా పనులు చేసే వారు వైన్స్‌, బార్ల ఎదుట క్యూ కడుతున్నారు.

ఇప్పుడు విచ్చలవిడిగా..

గతంలో అడపా దడపా విక్రయాలు సాగించినా వారిని కూర్చొని మద్యం తాగేందుకు అనుమతించే వారు కాదు. అయితే ఇటీవల వైన్‌ షాపుల నిర్వాహకులు అక్రమంగా మద్యం అమ్మకాలు చేయడమే కాకుండా, మద్యం కొనుగోలు చేసిన వారిని లోపల కూర్చొని తాగేందుకు సైతం అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితులు తిరిగి తలెత్తకుండా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

విజయవాడ రూరల్‌లో

తెల్లవారుజామునే తెరుచుకుంటున్న

బార్లు, వైన్‌ షాపులు

టీ దుకాణాల కంటే ముందుగానే

మద్యం షాపులు రెడీ

వాకర్స్‌ కన్నా ముందే

మందుబాబుల హల్‌చల్‌

పట్టించుకోని ఎకై ్సజ్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement